ఇండియా ఫార్మా పరిశ్రమ: త్వరలో అమెరికా ఆంక్షలు?
జెనెరిక్ ఔషధ తయారీలో పేరెన్నిక గన్న భారత ఫార్మా పరిశ్రమపై వాణిజ్య ఆంక్షలు విధించడానికి అమెరికాలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ కంపెనీలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎఫ్.డి.ఏ కమిషనర్ మార్గరెట్ హాంబర్గ్ ఇటీవలే ఇండియా పర్యటించారు. ఆమె వివిధ ఔషధ ఎగుమతి కంపెనీల పరిశ్రమలను తనిఖీ చేసి వెళ్ళిన అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య వాతావరణం మరింత వేడెక్కింది. ‘ప్రాధామ్య విదేశాలు’ (Priority Foreign Countries –…