ఢిల్లీ విద్యుత్: కాగ్ ఆడిట్ పితలాటకం
ఢిల్లీ రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మూడు ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉన్నది. షీలా దీక్షిత్ రెండో ప్రభుత్వం, తన ఆధీనంలో ఉన్న విద్యుత్ పంపిణీని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పిన పుణ్యం కట్టుకున్నారు. దానికి ఆమె చెప్పిన బృహత్కారణం విద్యుత్ ప్రసార నష్టాలను తగ్గించడం, విద్యుత్ దొంగతనాలను అరికట్టడం. ఆ రెండూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నపుడు ఎందుకు జరగవో ఆమె చెప్పినట్లు లేదు. చెప్పినా, చెప్పకపోయినా ఈ కారణాలు చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం చేతగానితనాన్నే ఆమె చాటుకున్నారు.…
