రోహిత్: చట్టం ఉల్లంఘన కాదు, అణచివేతకు ప్రతిఘటన!

“మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య” శీర్షిక గల ఆర్టికల్ కింద వ్యాఖ్యాతల అభిప్రాయాలకు సమాధానం ఈ టపా. ********* మీ ప్రశ్నల రీత్యా నేను చెప్పవలసినవీ, అడగవలసినవి కొన్ని ఉన్నాయి. విషయం మొత్తాన్ని ‘చట్టం పాటించడం లేదా అతిక్రమించడం’ లోకి మీరు కుదించివేశారు. ఆ పరిధి వరకే మీ దృష్టి ఉన్నట్లయితే అది మీ యిష్టం. కానీ ఈ అంశం కేవలం చట్టం అనుసరణ/ అతిక్రమణ వరకే పరిమితం అయిందని నేను భావించడం…

రోహిత్: అబ్బే మేము తాకనిదే! -కార్టూన్

రోహిత్ వేముల ఆత్మహత్యకు తాము బాధ్యులం కాదని బాధ్యులైన వారంతా వివిధ మాటల్లో ప్రకటించారు. “ఇది దళిత-దళితేతర సమస్య” కాదు అనీ “శిక్షించిన కమిటీ నేత దళిత ప్రొఫెసరే” అనీ  ప్రకటిస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రి దూరం జరిగారు. “ఐదు రిమైండర్ లు రాయడం మామూలే. ఒత్తిడి కాదు” అని కూడా ఆమె నిరాకరించారు. “ఇది నేను తీసుకున్న చర్య కాదు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్నది” అంటూ వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు నిరాకరణ…

రోహిత్ ఆత్మహత్య: సస్పెన్షన్ ఎత్తివేత

కేంద్ర ప్రభుత్వ విశ్వ విద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోహిత్ మిత్రులు నలుగురు రీసర్చ్ స్కాలర్ విద్యార్ధులపై స్పస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. సస్పెన్షన్ ఎత్తివేసినందున విద్యార్ధులంతా సాధారణ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని వైస్ ఛాన్సలర్ పి అప్పారావు కోరారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమించిన సబ్ కమిటీ గురువారం సమావేశమై సస్పెన్షన్ ను బేషరతుగా ఎత్తివేయడానికి నిర్ణయించిందని పాలకవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. “యూనివర్సిటీలో నెలకొన్న అసాధారణ…

రోహిత్: దళిత విద్యార్ధులు Vs హిందూత్వ రాజ్యం!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆమె ఇచ్చిన వివరణ విద్యార్ధుల భావోద్వేగాలను చల్లార్చడానికి బదులు మరింత రెచ్చగొట్టినట్లుగానే వెలువడింది. “ఇది దళితులు-దళితేతరుల మధ్య సమస్యకు సంబంధించినది కాదు. రెండు విద్యార్ధి సంఘాలకు మధ్య ఘర్షణకు సంబంధించిన సమస్య. దళిత్ పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దు” అని ఆమె ప్రకటించారు. అదే నోటితో ఆమె “వైస్ ఛాన్సలర్ ఆదేశాలను (ఆర్డర్ ను) విద్యార్ధులకు స్వయంగా అందించిన వ్యక్తికూడా దళితుడే” అంటూ తాను కూడా దళితుడి భుజం…