భవనం కూలిన ఘటనలో హృదయవిదారక దృశ్యాలు -ఫోటోలు
నిర్మాణ కాంట్రాక్టర్ల అత్యాశ ఫలితంగా చెన్నైలో నిర్మాణంలో ఉండగానే 11 అంతస్ధుల భవనం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 7గురు నిర్మాణ కూలీలు మరణించారని నిన్న ప్రకటించగా, ఈ రోజు మృతుల సంఖ్య 11కు పెరిగింది. భవన శిధిలాల కింద అనేకమంది చిక్కుకుని ఉన్నారని భయపడుతున్నారు. శిధిలాల సందుల నుండి చేతులు చాచి తమను కాపాడమంటూ బాధితులు వేడుకుంటున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. తలవరకు కనిపిస్తున్న బాధితులు కొందరయితే, చేయి మాత్రమే కనిపిస్తూ కాపాడమని చేస్తున్న ఆర్తనాదాలు వినిపిస్తున్నది మరి…
