వాల్ స్ట్రీట్: టూ బిగ్ టు జెయిల్ -కార్టూన్
2008 లో సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇంకా కోలుకోలేదు. పొదుపు ఆర్ధిక విధానాలను రుద్దుతూ తాత్కాలికంగా సంక్షోభాన్ని కార్మిక వర్గంపైకి నెట్టేసిన వాల్ స్ట్రీట్ కంపెనీలు మళ్లీ లాభాలు పుంజుకున్నప్పటికీ ప్రభుత్వాలు ఇంకా బక్క చిక్కే ఉన్నాయి. ట్రిలియన్ల కొద్దీ డాలర్లను అప్పులు తెచ్చి అమెరికా, యూరప్ ప్రభుత్వాలు వాల్ స్ట్రీట్ ను బయటపడేశాయి. కాని అత్యాశతో అనేక అక్రమ వ్యాపార పద్ధతులను అవలంబించి, చట్టాలను తుంగలో తొక్కిన బడా…
