సంతకం అయింది -ఇండియా; అబ్బే లేదు -రష్యా

అత్యాధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధ S-400 అమ్మకం ఒప్పందానికి సంబంధించి బుధవారం కొద్ది నిమిషాల వ్యవధిలో పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడ్డాయి. అమెరికా దగ్గర కూడా ఇంతవరకు సమాధానం లేని అత్యంత ఆధునిక మిసైల్ రక్షణ వ్యవస్ధగా పేరు పొందిన S-400 వ్యవస్ధలను తమకూ అమ్మాలని ఇండియా కోరుతోంది. ఈ ఒప్పందం అందినట్లే అంది దూరం జరుగుతోంది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జరిపిన రష్యా పర్యటన ప్రధాన లక్ష్యం S-400…