పాక్ పౌర విమానాన్ని దారిమళ్లించిన బ్రిటన్ ఫైటర్ జెట్స్, ఇద్దరు అరెస్టు

బి.బి.సి, రాయిటర్స్ వార్తా సంస్ధల ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని బ్రిటన్ లోని ఎసెక్స్ పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో 297 మంది ప్రయాణిస్తున్నారని ది హిందు, ఎన్.డి.టి.వి, రాయిటర్స్ చెప్పగా బి.బి.సి మాత్రం ప్రయాణికులు 308 మంది విమాన సిబ్బంది 14 మంది విమానంలో ఉన్నారని తెలిపింది. రెండు రోజుల క్రితం లండన్ లోని వూల్ విక్ అనే చోట ఇద్దరు నైజీరియా సంతతి యువకులు ఒక బ్రిటిష్ సైనికుడిని నడి రోడ్డు పైన హత్య…