ఆడ శిశువుల పీక నులుముతున్న ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆడ శిశువుల పాలిట వధ్య ప్రదేశ్ గా మారుతోంది. కడుపులో ప్రాణం పోసుకున్న వెంటనే పుట్టబోయేది ఆడపిల్లలేనని చెప్పడానికి కార్పొరేట్ ఆసుపత్రులు సైతం క్యూ కట్టడంతో ఆడ పిండాలు ఎదగకుండానే పీక నులమడానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్నారు. గత దశాబ్ద కాలంలో ఆడ పిల్లల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రా రెడ్డి స్వయంగా తెలియజేశారు. ఆడ శిశువులను గర్భంలోను, పురిటిలోను చంపడాన్ని నివారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో…