తూ.చై.స: చైనా రూల్స్ పాటించండి -అమెరికా
అమెరికా మెడలు వంచడంలో చైనా సఫలం అయిందా? కనీసం తూర్పు చైనా సముద్రం వరకయినా అమెరికాను దారికి తెచ్చుకోవడంలో చైనా పాక్షికంగా సఫలం అయినట్లు కనిపిస్తోంది. తూర్పు చైనా సముద్రంలోని దియోయు/సెంకాకు ద్వీపకల్పం పైన చైనా విధించిన నిబంధనలను పాటించాల్సిందిగా తమ వాణిజ్య విమానాలకు అమెరికా ప్రభుత్వం సలహా ఇచ్చింది. చైనా విధించిన ‘వాయు రక్షణ గుర్తింపు మండలం’ (Air Defence Identification Zone -ADIZ) పరిధిని ఉల్లంఘిస్తూ ప్రవేశించిన అమెరికా, జపాన్, దక్షిణ కొరియా యుద్ధ…
