పేద గొప్ప తేడాలెరగని నిద్ర -ఫోటోలు

ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు అంటారు. సుఖం మాట ఎలా ఉన్నా నిద్రాదేవికి పేద గొప్ప తేడాలతో పని లేని మాట నిజం. ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని ఆదరించి జోకొట్టే సుగుణవతి నిద్రాదేవి. ఆ మాటకొస్తే సృష్టిలో నిద్రపోని జీవి అంటూ లేదు. అలసి సొలసిన శరీరాలను తన ఒడిలో చేర్చుకుని, సేదదీర్చి, తిరిగి నూతన జవసత్వాలను నింపే నిద్రమాత ప్రసన్నం కోసం మనిషి ‘నిద్ర మాత్ర’ ను కూడా కనిపెట్టాడు. నిద్ర…