బంగాళాఖాతంలో మలేషియా విమానం?

హిందూ మహా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా పౌర విమానం MH370 గురించి మరో కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రైవేటు కంపెనీ సదరు విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందని భావించేందుకు తగిన ఆధారాలు తమకు లభ్యం అయ్యాయని ప్రకటించింది. అప్పుడే నిర్ధారించలేము గానీ తమకు దొరికిన శిధిలాలన్నీ బోయింగ్ 777 కి సంబంధించిన శిధిలాలే అనీ కాబట్టి మలేషియా విమానం బంగాళాఖాతంలో కూలిందనేందుకు ఇది గట్టి సాక్ష్యం కావచ్చని తెలిపింది. గత కొద్ది…

MH370: బ్లాక్ బాక్స్ సంకేతాలు రికార్డు చేసిన చైనా

విమానాల్లో అత్యంత ముఖ్యమైన భాగం బ్లాక్ బాక్స్, విమానాలు ప్రమాదానికి గురయినపుడు ఆ ప్రమాదం గురించిన వివరాలను బ్లాక్ బాక్స్ నుండి సేకరిస్తారు. విమానం కాక్ పిట్ లో జరిగిన సంభాషణలను కూడా ఇది రికార్డు చేస్తుంది. విమానానికి ఎదురయిన వివిధ సాంకేతిక ఇబ్బందుల సమాచారాన్ని కూడా ఇది పట్టిస్తుంది. మలేషియా విమానం MH370 బ్లాక్ బాక్స్ కోసం ప్రస్తుతం అన్వేషణ సాగుతోంది. బ్లాక్ బాక్స్ సంకేతాలు అనదగ్గ సిగ్నల్స్ ను చైనా నౌక రికార్డు చేసిందన్న…

సముద్రంలోనే కూలింది, నిర్ధారించిన మలేషియా ప్రధాని

ఎట్టకేలకు మలేషియా ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. తమ పౌర విమానం MH370 హిందూ మహా సముద్రంలో ఎవరూ పెద్దగా సంచరించని చోట కూలిపోయిందని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో నిరూపించిందని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీర నగరం పెర్త్ కు పశ్చిమ దిశగా 2,000 కి.మీ దూరంలో విమానం కూలిపోయిందని, ప్రమాదంలో ఎవరూ బతికి బట్టకట్టలేదని తాము భావిస్తున్నామని తెలిపారు. విలేఖరుల సమావేశానికి కొద్ది నిమిషాలకు…

MH370: ప్రమాదానికి కారణం కాక్ పిట్ ఎమర్జెన్సీ?

దర్యాప్తు అధికారులు వెల్లడించిన కొన్ని అంశాలు MH370 అదృశ్యంపై కొత్త వెలుగును ప్రసరింప జేశాయి. ఈ అంశాలు మలేషియా అధికారుల దృష్టిలో మొదటి నుండీ ఉన్నప్పటికీ ప్రపంచానికి తెలియడం ఇదే తొలిసారి. డెయిలీ మెయిల్ పత్రిక ఈ అంశాలను వెల్లడి చేసింది. తనను తాను గుర్తించడానికి నిరాకరించిన మలేషియా దర్యాప్తు అధికారిని ఉటంకించిన డెయిలీ మెయిల్ (సి.ఎన్.ఎన్ ద్వారా), విమానం 35,000 అడుగుల ఎత్తు నుండి ఒక్కసారిగా 12,000 అడుగుల ఎత్తుకు దిగి వచ్చిందని తెలిపింది. ఏవియేషన్…

MH370: ఇప్పుడు పులిరాజు గారు ఫ్రాన్స్!

ఆస్ట్రేలియా, చైనాలది అయింది. ఇప్పుడిక ఫ్రాన్స్ వంతు వచ్చింది! ఫ్రాన్స్ శాటిలైట్ లు కూడా హిందూ మహా సముద్రంలో MH370 విమాన శిధిలాలుగా భావించ దగిన వస్తువుల్ని కనిపెట్టాయిట! విమానం అదృశ్యం అయి రెండు వారాలు పైనే అయింది. తమ వారి పరిస్ధితి ఏమయిందో తెలియక బాధితులు రెండు వారాలుగా తీవ్ర ఆవేదన చెందుతుంటే… ఇప్పుడు తీరిగ్గా మా శాటిలైట్లు అప్పుడే కనిపెట్టాయంటూ ఆయా దేశాలు మెల్లగా చెప్పడం విడ్డూరం. ఫ్రాన్స్ తమ శాటిలైట్ తీసిన చిత్రాలను…

MH370: చైనా శాటిలైట్ చిత్రంలో విమాన శిధిలాలు?

హిందూ మహా సముద్రంలోనే విమాన శిధిలాలు ఉన్నట్లు అనుమానించేందుకు మరో సాక్ష్యం లభించినట్లు తెలుస్తోంది. ఈసారి చైనా దేశానికి చెందిన శాటిలైట్ ‘గావోఫెన్ –1’ రికార్డు చేసిన చిత్రంలో తాజా ఆనవాళ్ళు లభ్యం అయ్యాయి. మార్చి 18 మధ్యాహ్నం సమయంలో శాటిలైట్ గ్రహించిన ఇమేజ్ లో 22 మీ. పొడవు, 30 మీ వెడల్పు ఉన్న వస్తువు కనపడినట్లు చైనా సమాచారం ఇచ్చిందని మలేషియా రవాణా మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ కౌలాలంపూర్ లో విలేఖరులకు తెలిపారు. ఆస్ట్రేలియా…

ఆస్ట్రేలియా సమీపంలో విమాన శిధిలాలు? -ఫోటోలు

మార్చి 8 తేదీన అదృశ్యం అయిన విమానానికి సంబంధించి ఒక ఆశాజనక వార్త వెలువడింది. ఆస్ట్రేలియా ప్రధాని ఈ వార్తకు కర్త. ఆస్ట్రేలియాకు పశ్చిమ తీరాన ఉండే పెర్త్ నగరానికి వాయవ్య దిశలో దక్షిణ హిందూ మహా సముద్రంలో విమాన శిధిలాలుగా భావించదగ్గ రెండు వస్తువులు కనిపించాయన్నది ఈ వార్త సారాంశం. మార్చి 16 నాటి శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ వస్తువులను కనిపెట్టారు. వీటిలో ఒకటి 78 అడుగుల పొడవు ఉండగా మరొకటి 15 అడుగుల…

అండమాన్ పై MH370, కనుగొన్నది హైద్రాబాద్ టెకీ

అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న పశ్చిమ దేశాలేవీ సాధించలేని ఘనకార్యాన్ని హైద్రాబాద్ కి చెందిన ఐ.టి. ఎనలిస్టు సాధించినట్లు తెలుస్తోంది. పాతికకు పైగా దేశాలకు చెందిన నౌకలు, హెలికాప్టర్లు, వేగు విమానాలు గత పది రోజులుగా సముద్రాలూ, నేలలన్నింటా జల్లెడ పడుతున్నా కనిపించని విమానాన్ని శాటిలైట్ చిత్రాల్లో హైద్రాబాద్ టెకీ అనూప్ మాధవ్ గుర్తించారని సి.ఎన్.ఎన్ చెబుతోంది. ఈ విషయాన్ని మలేషియా ధృవీకరించిందా లేదా అన్నది తెలియలేదు. యెగ్గిన అనూప్ మాధవ్ వృత్తి రీత్యా ఐ.టి. ఎనలిస్టు. QBo2…

పేలలేదు, కూలలేదు -ఐరాస

మలేషియా విమానం ‘ఫ్లైట్ MH370’ గాలిలో పేలిపోయిందనడానికి గానీ, సముద్రంలో కూలిపోయిందనడానికి గానీ సాక్ష్యాలు లేవని ఐరాసకు చెందిన సంస్ధ CTBTO ప్రకటించింది. ‘సమగ్ర (అణు) పరీక్షల నిషేధ ఒప్పంద సంస్ధ’ (Comprehensive Test Ban Treaty Organisation) ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశీలనా కేంద్రాలేవీ విమానం కూలిపోయిన జాడలు గానీ, పేలిపోయిన జాడలను గాని రికార్డు చేయలేదని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ ప్రతినిధి స్టెఫాన్ డుజరిక్ ప్రకటించారు. విమానం సముద్రంలో కూలినా, నేలపై…

కావాలనే దారి మార్చారు -మలేషియా ప్రధాని

మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కావాలనే దారి మళ్లించారని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ధృవీకరించారు. అయితే విమానం హైజాక్ కి గరయిందని మాత్రం ఆయన చెప్పలేదు. మరిన్ని వివరాలు తెలిస్తే తప్ప హైజాక్ కి గురయింది లేనిదీ ధృవీకరించడం సాధ్యం కాదని మలేషియా భావిస్తోంది. విమానం కమ్యూనికేషన్లు మరియు ట్రాకింగ్ వ్యవస్ధలను ఉద్దేశ్యపూర్వకంగానే మూసివేసి విమానాన్ని దారి మళ్లించారని నజీబ్ తెలిపారు. ప్రధాని నజీబ్ విలేఖరులకు ఈ సంగతి చెప్పిన తర్వాత పోలీసులు విమానం పైలట్…

మలేషియా విమానం: ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చిందా? -ఫొటోలు

అదృశ్యం అయిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం Flight MH370 ఉద్దేశ్యపూర్వకంగానే దారి మార్చుకుని అండమాన్ వైపుకి ప్రయాణించిందా అన్న అంశాన్ని మలేషియా అధికారులు పరిశోధిస్తున్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు హిందూ మహా సముద్రంలో కూడా వెతుకులాట ప్రారంభం కావచ్చని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి జె కార్ని ప్రకటించడంతో మలేషియా అధికారుల అనుమానాలకు ఇతర దేశాలు కూడా విశ్వసిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. విమానాన్ని ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చి అండమాన్ సముద్రం మీదికి,…

మలేషియా ప్రమాదం: అది విమాన ఇంధనం కాదు

మలేషియా విమాన ప్రమాదం మరింత మిస్టరీలోకి జారిపోయింది. దక్షిణ చైనా సముద్రంలో కనపడిన రెండు భారీ చమురు తెట్లు విమాన ఇంధనంకు సంబంధించినవి కావని పరీక్షల్లో తేలింది. వియత్నాం నావికా బలగాలకు కనపడ్డాయని చెబుతున్న విమాన శిధిలాలు కూడా వాస్తవానికి ఎక్కడా కనపడలేదని తెలుస్తోంది. దీనితో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చుట్టూ మరింత మిస్టరీ అల్లుకున్నట్లయింది. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ప్రయాణిస్తున్న ఇరువురు ప్రయాణీకులు మలేషియా దేశస్ధులు కారని, చైనా…

ఆచూకీ లేని విమానం, టెర్రరిజం అనుమానం

దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మలేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, చైనా దేశాలకు చెందిన విమానాలు, నౌకలు ఉమ్మడిగా గాలిస్తున్నప్పటికీ వారి గాలింపు ఫలవంతం కాలేదు. అమెరికా, ఐరోపాల సాయం తీసుకోవడానికి నిర్ణయించినట్లు మలేషియా మంత్రులు ప్రకటించారు. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ఇద్దరు ప్రయాణీకులు విమానంలో ఉన్నందున టెర్రరిస్టు చర్యకు గురై ఉండొచ్చన్న అవకాశాన్ని ఎవరూ నిరాకరించడం లేదు. విమానం ప్రయాణించిన తీరును బట్టి అది…

239 మందితో సముద్రంలో కూలిన మలేషియా విమానం?

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్ కు బయలుదేరిన బోయింగ్-777 విమానం ఒకటి సముద్రంలో కూలిపోయినట్లు భయపడుతున్నారు. బయలుదేరిన 40 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు తెగిపోయిన విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దక్షిణ చైనా సముద్రంలో 10 నుండి 15 కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఇంధనం చూసి అనుమానించిన వియత్నాం నావికా దళాల ద్వారా మొదట సమాచారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం…