సైబర్ చరిత్రలోనే అతి పెద్ద హ్యాకింగ్ దాడులు, చైనాపై అనుమానాలు
ఇంటర్నెట్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ చరిత్రలో మున్నెన్నడూ ఎరగనంత పెద్ద స్ధాయిలో సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు. ఈ హ్యాకింగ్ దాడులను గుర్తించిన మెకేఫీ (McAfee)సంస్ధ ఈ దాడుల వెనుక ఒక దేశ ప్రభుత్వం ఉందని చెబుతూ, ఆ దేశం పేరు చెప్పడానికి నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి, ప్రభుత్వాలు, కంపెనీలతో సహా 72 సంస్ధల నెట్ వర్క్‌లు సైబర్ దాడులకు గురయినట్లు గుర్తించారు. హ్యాకింగ్‌కి పాల్పడింది ఎవరో చెప్పడానికి మేకేఫీ నిరాకరించినప్పటికీ, ఈ వార్తను పత్రికలకు తెలిపిన సెక్యూరిటీ…