పిప్పర్మెంట్లతో కేంద్రం సరి, సమ్మెకే కార్మిక సంఘాల నిర్ణయం!

దేశ వ్యాపిత సమ్మె మరో రెండు రోజులు ఉందనగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి పిప్పర్మెంట్ బిళ్ళలు ఆశ చూపిస్తూ ముందుకు వచ్చింది. అనేక నెలలు ముందే కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపు ఇచ్చినప్పటికీ వారి పిలుపుకి స్పందించడానికి ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వానికి తీరిక దొరక లేదు. విదేశీ కంపెనీలు, పరిశ్రమల కోసం కార్మిక చట్టాలను కాలరాసిన మోడి ప్రభుత్వం కార్మికుల కోసం మాత్రం కేవలం రెండంటే రెండు రోజుల ముందు స్పందించి వారిని అపహాస్యం చేసింది.…