పన్నులు ఎగవేయడానికి పౌరసత్వం త్యజించనున్న ఫ్రాన్సు సంపన్నుడు!
బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఫ్రాన్సులో అత్యంత సంపన్నుడు. 41 బిలియన్ యూరోల (52.33 బిలియన్ డాలర్లు, 2.9 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తులతో ప్రపంచంలోనే నాలుగో స్ధానంలో ఉన్న కుబేరుడు. ఈయనకి అర్జెంటుగా ఓ సమస్య వచ్చి పడింది. ఫ్రాన్సు నూతన అధ్యక్షుడు హాలండే, సూపర్ ధనవంతుల ఆదాయాలపైన 75 శాతం పన్ను వేయనున్నట్లు ప్రకటించడమే ఈయన సమస్య. అధ్యక్షుడు హాలండే, సంవత్సరానికి 1 మిలియన్ యూరోల కు మించి ఆదాయం పొందుతున్నవారిపై 75 శాతం పన్ను వేస్తానని…
