ఆసియన్ అమెరికన్ల ఎదుగుదలపై ‘బాంబూ సీలింగ్’ -ఎన్.డి.టి.వి
అమెరికా కంపెనీలలో ఆసియా-అమెరికన్లు ఉన్నత స్ధానాలకు ఎదగకుండా అనేక ఆటంకాలు విధిస్తున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, తమ సామర్ధ్యం ఎంతగా రుజువు చేసుకున్నప్పటికీ కార్పొరేట్ అమెరికా వారిని గుర్తించడం లేదనీ తెలిపింది. కంపెనీలకి విధేయులుగా ఉంటున్నప్పటికీ తమను తాము కంపెనీలకు చెందినవారుగా భావించలేకపోతున్నార తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎదుర్కొంటున్న ఆటంకాలకు అమెరికా సమాజంలో ఆసియన్లకు వ్యతిరేకంగా, అమెరికన్లకు అనుకూలంగా ‘పక్షపాతం’ పాతుకుపోయి ఉండడమే కారణమనీ ఇటీవలి సర్వేనూ, వివిధ నిపుణులనూ ఉటంకిస్తూ తెలియజేసింది. ఆసియా-అమెరికన్…
