సి.ఐ.ఎ కి ఇష్టమైన నీలి కళ్ల బాలుడే హక్కానీ నెట్ వర్క్ -పాక్ మంత్రి హీనా రబ్బానీ
పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి అమెరికాపై తన దండయాత్రను కొనసాగిస్తోంది. తీక్షణమైన ఖండన ప్రకటనలను జారీ చేయడంలో పేరు పొందిన హీనా రబ్బానీ తన పేరున నిలబెట్టుకుంటూ మరొక ప్రకటనను జారీ చేసింది. ప్రమాదకరమైన సంస్ధగా అమెరికా పరిగణిస్తున్న హక్కానీ గ్రూపు నెట్ వర్క్ మరొకటేదో కాదనీ, సి.ఐ.ఎ అత్యంత ఇష్టంగా రూపొందించుకున్న “నీలి కళ్ల బాలుడే” ననీ అమెరికా చేస్తున్న ప్రకటనలను తిప్పి కొట్టింది. రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు…