ట్రంప్ వీసా బిల్లులు, భారతీయుల ఉపాధి -విశ్లేషణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాపులర్ వాగ్దానాలను శరవేగంగా అమలు చేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుండి వలసలను మూడు నెలల పాటు నిషేధించి ప్రపంచ వ్యాపితంగా కాక పుట్టించిన ట్రంప్, ఇప్పుడు ఉద్యోగాల సంరక్షణ పనిలో పడ్డాడు. అమెరికా దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (కాంగ్రెస్) లో ఇద్దరు సభ్యులు ఈ మేరకు రెండు వేరు వేరు బిల్లులు ప్రవేశపెట్టారు. అవి రెండూ విదేశీయులకు వీసాలు, ఉద్యోగాలు…