అలా అయితే నేను బలమైన ప్రధానిని కాను -డా. మన్మోహన్

యుపిఏ 2.0 ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్ని వైపుల నుండీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2జి సెక్ట్రమ్ స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కామ్, హెలికాప్టర్ స్కాం, ఇలా అనేక స్కాం లు వరస బెట్టి వెలుగు చూడటం వలన అసలు దోషులకు బదులు ప్రధాన మంత్రి పదవిలో ఉన్న డా. మన్మోహన్ సింగ్ పైనే విమర్శలు ఎక్కుపెట్టబడ్డాయి. ఎన్ని విమర్శలు వచ్చినా చాలా కాలం వరకు డా. మన్మోహన్ సింగ్…