అబర్దీన్ vs. మోడి govt.: కాంగ్రెస్ పన్ను చట్టం కొనసాగింపు?

ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక మంత్రిగా ఉండగా తెచ్చిన గార్ చట్టం (General Anti-Avoidance Rule) ను దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని ధ్వంసం చేసిన వేధింపుల చట్టంగా తిట్టిపోసిన మోడి ప్రభుత్వం అదే చట్టాన్ని ప్రయోగించి విదేశీ ద్రవ్య కంపెనీ ‘అబర్దీన్ అసెట్ మేనేజ్ మెంట్’ ను పన్ను కట్టమని తాఖీదు పంపింది. పన్ను డిమాండ్ చాలా తక్కువే అయినప్పటికీ దానిపై ముంబై హై కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా అబర్దీన్ కంపెనీ సంచలనానికి తెర లేపింది. పాత…

ప్రశ్న: రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే?

శ్రావణ్ కుమార్: రిట్రాస్పెక్టివ్ టాక్స్ అంటే ఏమిటి? మీకు సమయం ఉంటే పూర్తి వివరాలు ఇవ్వగలరు. సమాధానం: రిట్రాస్పెక్టివ్ అంటే ఈ సందర్భంలో అర్ధం, గత కాలానికి కూడా వర్తించేది అని. ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు ఆ చట్టం యొక్క స్వభావాన్ని బట్టి ఎప్పటి నుండి వర్తించేది కూడా చట్టంలో పొందుపరుస్తారు. వెంటనే అమలులోకి వచ్చేటట్లయితే ‘with immediate effect’ అంటారు. గతంలో నిర్దిష్ట తేదీ నుండి వర్తింపజేయాలని భావిస్తే ఆ తేదీని చట్టంలో పొందుపరుస్తారు. ఇలా…

వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

భారత ప్రభుత్వానికి వోడాఫోన్ కంపెనీ పన్ను ఎగవేసిన వివాదానికి సంబంధించి ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కోసం ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలను అపఖ్యాతిపాలు చెయ్యడంలో కొత్త ఆర్ధిక మంత్రి చిదంబరం బిజీ అయినట్లు కనిపిస్తోంది. వోడా ఫోన్ పన్ను విషయమై దుడుకు (rash) నిర్ణయాలు తీసుకోబోమని చిదంబరం సోమవారం ప్రకటించాడు. తద్వారా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం అనాలోచితమైనదని పరోక్షంగా సూచించాడు. కేమన్ ఐలాండ్ లో రిజిస్టరై భారత్…

లాభాల్లో షేర్లు, ప్రణబ్ సవరణపై వివరణ ఫలితం?

శుక్రవారం భారత షేర్ మార్కెట్లు అత్యధిక లాభాలతో ముగియగా, రూపాయి బాగా కోలుకుంది. బి.ఎస్.ఇ సెన్సెక్స్ రికార్డు స్ధాయిలో 2.59 శాతం (439 పాయింట్లు) లాభ పడగా డాలరుతో రూపాయి మారకం విలువ దశాబ్ధంలోనే రికార్డు స్ధాయిలో 119 పైసలు పెరిగింది. ఇటలీ, స్పెయిన్ దేశాలకు ఋణాల రేట్లు తగ్గించడానికి యూరోపియన్ దేశాల సమావేశం నిర్ణయాత్మక చర్యలు ప్రకటించడమే భారత మార్కెట్ల ఉత్సాహానికి కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించగా, ప్రణబ్ సవరణపై (GAAR) ఆర్ధిక శాఖ…

ప్రణబ్ సవరణలను వెనక్కి తిప్పడానికి మన్మోహన్ ప్రయత్నాలు?

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నందున ఆర్ధిక మంత్రిత్వ శాఖను చేపట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం సవరణలను వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు పత్రికల వార్తలను బట్టి అర్ధం అవుతోంది. వోడా ఫోన్ లాంటి కంపెనీలు యాభై వేల కోట్లకు పైగా పన్నులు ఎగవేయడానికి ఆస్కారం కలిగించిన లూప్ హోల్ ను పూడ్చడానికి ప్రణబ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గత యాభై యేళ్లకు వర్తించేలా సవరణలను ప్రణబ్ ప్రతిపాదించడంతో జాతీయ,…