మా కోర్టుల గురించి మీరేమనుకుంటున్నారు? –ఇటలీతో సుప్రీం
– భారత సుప్రీం కోర్టు సోమవారం ఉగ్రరూపం దాల్చింది. హామీని ఉల్లంఘించిన ఇటలీ రాయబారి డేనియల్ మాన్సిని పైన విరుచుకుపడింది. దేశం విడిచి వెళ్లరాదని మార్చి 14 తేదీన తాము ఇచ్చిన ఆదేశాలను ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. వియన్నా సదస్సు లో అంగీకరించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం విదేశీ రాయబారులకు వర్తించే ‘నేర విచారణ నుండి మినహాయింపు‘ (immunity) డేనియల్ కు వర్తించదని స్పష్టం చేసింది. ఒక పిటిషనర్ గా కోర్టులో ఒక ప్రక్రియను ప్రారంభించిన…