ఎడతెగని హింసా క్షేత్రం ఉక్రెయిన్ -ఫోటోలు

యూరోపియన్ యూనియన్ కి అనుకూలంగా రెచ్చగొట్టబడిన ఆందోళనలు తీవ్ర హింసారూపం దాల్చడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వీధుల్లో రక్తం పారుతోంది. గురు, శుక్రవారాల్లో జరిగిన హింసాత్మక దాడులు, ప్రతిదాడుల పర్యవసానంగా 70 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భద్రతా బలగాలే భవంతులపై నుండి కాల్పులు జరపడం వలన ఆందోళనకారులు మరణించారని పశ్చిమ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు అసలు కీవ్ లోనే లేకపోవడం, రక్తపాత దాడులు అరికట్టడానికి యూరోపియన్ దేశాల నేతలు కుదిర్చిన…

కార్మిక వర్గ పోరాటాలను హైజాక్ చేసిన “వాల్ స్ట్రీట్ ఆక్రమిద్దాం” ఉద్యమం -4

OTPOR మరియు CANVAS (కేన్వాస్) OTPOR అన్నది సెర్బియా భాషా పదం. ‘ప్రతిఘటన’ అని దాని అర్ధం. సెర్బియాలో 1998లో తలెత్తి 2003వరకూ కొనసాగిన ఉద్యమంగా ఇది చరిత్రలో రికార్డయి ఉంది. అహింసా పద్ధతుల్లో ఉద్యమించి నాటో దాడులకు, సామ్రాజ్యవాద ఆక్రమణలకు ఎదురొడ్డి నిలిచిన అప్పటి సెర్బియా నాయకుడు స్లోబోడాన్ మైలోసెవిక్ ను అక్టోబరు 5, 2000 న కూలదోయగలిగిందని ఈ సంస్ధకు పేరు ఉంది. మైలోసెవిక్ ప్రభుత్వం కూలిపోయాక కూడా ఈ సంస్ధ కొనసాగి కొత్త…