కాశ్మీర్: ఎఎపి ఆఫీసు దాడి, హిందూ రక్షా దళ్ నేత అరెస్ట్

బుధవారం ఉదయం ఘజియాబాద్, కౌసాంబి లోని ఎఎపి ప్రధాన కార్యాలయం పైన హిందూ రక్షా దళ్ పేరుతో 40 మందితో కూడిన మూక దాడి చేసింది. అక్కడ ఉన్న పూల కుండీలను వాళ్ళు పగల గొట్టారు. పార్టీ ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలను పగల గొట్టారు. ఇక హిందూ మతాన్ని కాపాడుతాం… లాంటి నినాదాలు మామూలే. సుప్రీం కోర్టు ఎదురుగా ఉన్న తన కార్యాలయంలోకి రెండేళ్ల క్రితం జొరబడి దాడి చేసి కొట్టింది కూడా…

ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్

“మన కాశ్మీరు పాలసీ పైన జనాభిప్రాయం ఏమిటో ఎస్.ఎం.ఎస్, ట్విట్టర్ ల ద్వారా తెలుసుకోవాల్సింది కాదా?” – కాశ్మీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సాధారణ విధానం నుండి పక్కకు తప్పుకుంది. ప్రతి పనికీ ప్రజల అభిప్రాయాన్ని కోరే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అటువంటి విధానం కాశ్మీరు ప్రజలకు మాత్రం వర్తించదని తన వింత విధానం ప్రకటించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద్వంద్వ విధానం కలిగి ఉందన్నట్లే, ముఖ్యంగా కాశ్మీరు విషయంలో.…