వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు, 9/11 దాడులతో సహా -ఫొటోలు

పెట్టుబడిదారుడి దృష్టిలో ప్రతిదీ సరుకే. అది కూడా లాభాలు సంపాదించి పెట్టే సరుకులుగానే వస్తువుల్ని అతను చూస్తాడు. సేవల పేరుతో ఇప్పుడు వస్తువులతో పాటు భావాలనీ, బాధలనీ, కష్టాలనీ, కన్నీళ్ళనీ, సంతోషాన్ని, బంధాలనీ, అను బంధాలనీ కూడా మారకపు సరుకులుగా పెట్టుబడిదారుడు మార్చ గలిగిగాడు. ఏ అంశాన్నైనా పెద్ద ఎత్తున పతాక శీర్షికలకి నెట్టడం ద్వారా దానికి కొంత మారకపు విలువను జోడించగలుగుతున్నాడు. ఆ తర్వాత అమ్మకానికి పెడుతున్నాడు. బాబో, పాపో పుడితే సంతోషం. ఆ సంతోషాన్ని…