రెండు రోజుల బంద్‌తో తెలంగాణలో స్తంభించిన సాధారణ జనజీవనం

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జె.ఎ.సి ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతమైందనే చెప్పాలి. రెండో రోజు వరసగా సాధారణ జన జీవనం స్తంబించిపోయింది. స్కూళ్ళు, కాలేజిలు, షాపులు, పెట్రోల్ పంపులు ఇంకా ఇతర వ్యాపార సంస్ధలన్నీ మూసివేశారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభనకు గురయ్యాయి. రవాణా వ్యవస్ధ తెలంగాణలోని పది జిల్లాల్లోనూ ప్రతిష్టంభనకు గురయ్యింది. హైద్రాబాదులో కూడా బందు పూర్తిగా విజయవంతమైందని పత్రికా సంస్ధలు తెలిపాయి. ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ముందు జాగ్రత్తతో వ్యవహరించి బస్సులను గ్యారేజిలకే పరిమితం చేశారు.…