ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు వేసుకున్న మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్

డి.ఎం.కె మంత్రులు టెలికం మంత్రిత్వ శాఖను తమ సొంత సొమ్ము కింద జమకట్టి వాడుకున్న విషయాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. స్పెక్ట్రం కేటాయింపుల విషయాన్ని మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించకుండా మొత్తం టెలికం శాఖకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ కు లేఖ రాసిన దయానిధి మారన్ గారి మరొక నిర్వాకాన్ని సి.బి.ఐ విచారణ చేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తన చెన్నై నివాసానికి 323 టెలిఫోన్ లైన్లు వేయించుకున్న…