ఇరాక్: అమెరికా అంటించిన రావణ కాష్టం
అమెరికా, ఐరోపాలు నెలకొల్పిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇరాక్ లో మూడు పేలుళ్లు, అరవై చావులుగా వర్ధిల్లుతోంది. పశ్చిమ దేశాల నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్… ఇత్యాది దేశాల సైనిక మూకలు మోసుకొచ్చిన ఆధునిక విలువలు ఇరాక్ ను ఆధునిక నరకంగా మార్చివేశాయి. 8 యేళ్ళ పాటు తిష్ట వేసిన నాటో కూటమి సైన్యాలు నాటిన సెక్టేరియన్ విద్వేషాలు ఇప్పుడక్కడ ఆత్మాహుతి దాడులుగా, బాంబు పేలుళ్లుగా, వేలాది హత్యలుగా పుష్పించి విరాజిల్లుతున్నాయి. 2008 తర్వాత అత్యంత…
