ఎయిర్ టెల్, వొడాఫోన్ లపై సి.బి.ఐ దాడులు, ఇక బి.జె.పి వంతు?

ఇక సి.బి.ఐ కన్ను బి.జె.పి పాలనలోని స్పెక్ట్రమ్ అవకతవకలపై పడింది. శనివారం వొడాఫోన్ భారతీయ యూనిట్ కార్యాలయం పైనా, ఎయిర్ టెల్ కార్యాలయం పైనా దాడులు చేసింది. 2001-02 లో ప్రభుత్వం చేసిన స్పెక్ట్రం కేటాయింపులపైన వివరాలు సేకరించే లక్ష్యంతో ఈ దాడులు నిర్వహించింది. బి.జె.పి ప్రభుత్వ కాలంలో జరిగిన స్పెక్ట్రం కేటాయింపులలో అవకతవకలు జరిగాయో లేదో నిర్ధారించుకునే క్రమంలో తగిన సమాచార సేకరణకు ఈ దాడులు నిర్వహించినట్లుగా సి.బి.ఐ ప్రతినిధి ధరణి మిశ్రా తెలిపింది. “ప్రభుత్వ…