2జి వేలంలో 60 వేల కోట్ల ఆదాయం
ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్…
