డ్రోన్ హత్యలు చట్టబద్ధమే -అమెరికా
డ్రోన్ హత్యలను అమెరికా సమర్ధించుకుంది. చట్టాలకు అనుగుణంగానే తాను డ్రోన్ హత్యలకు పాల్పడుతున్నానని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జే కేర్ని ఈ మేరకు విలేఖరుల సమావేశం పెట్టి మరీ తమ హంతక చర్యలను సమర్ధించుకున్నాడు. అమలు చేయదగిన అన్ని చట్టాలకు అనుగుణంగానే తమ డ్రోన్ హత్యలు సాగుతున్నాయని ఆయన అన్నాడు. కానీ ఆ చట్టాలేమిటో ఆయన చెప్పలేదు. అమెరికా డ్రోన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్…



