హ్యాకింగ్ దాడుల్లో సగం అమెరికా నుండి వస్తున్నవే -చైనా

2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం తెలిపింది. అమెరికాతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ఇంటర్నెట్ హ్యాకింగ్ దాడులకు షాంఘై లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన ఒక భవంతి ప్రధాన కేంద్రంగా ఉందంటూ అమెరికా సైబర్ కంపెనీ ‘మాండియంట్‘ ఒక నివేదిక వెలువరించిన మూడు…

సైబర్ చరిత్రలోనే అతి పెద్ద హ్యాకింగ్ దాడులు, చైనాపై అనుమానాలు

ఇంటర్నెట్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ చరిత్రలో మున్నెన్నడూ ఎరగనంత పెద్ద స్ధాయిలో సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించారు. ఈ హ్యాకింగ్ దాడులను గుర్తించిన మెకేఫీ (McAfee)సంస్ధ ఈ దాడుల వెనుక ఒక దేశ ప్రభుత్వం ఉందని చెబుతూ, ఆ దేశం పేరు చెప్పడానికి నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి, ప్రభుత్వాలు, కంపెనీలతో సహా 72 సంస్ధల నెట్ వర్క్‌లు సైబర్ దాడులకు గురయినట్లు గుర్తించారు. హ్యాకింగ్‌కి పాల్పడింది ఎవరో చెప్పడానికి మేకేఫీ నిరాకరించినప్పటికీ, ఈ వార్తను పత్రికలకు తెలిపిన సెక్యూరిటీ…