ఏకంగా సి.ఐ.ఏ వెబ్‌సైట్ నే మూసేసిన ‘లుల్జ్ సెక్యూరిటీ’ హ్యాకర్లు

సి.ఐ.ఏ. కుట్ర, కుతంత్రాల పుట్ట. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఎన్నో ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చిన దగుల్బాజీ సంస్ధ. ఎందరో నియంతలను కంటికి రెప్పలా కాపాడిన ధూర్త సంస్ధ. ఎందరో మానవ హక్కుల కార్యకర్తలను, ప్రజాపోరాటాల నాయకులను దుర్మార్గంగా హత్య చేసిన హంతక సంస్ధ. శాంతి విలసిల్లుతున్న దేశాల్లో విభేధాల కుంపట్లు రగిలించి జాతి హత్యాకాండలను ప్రోత్సహించిన జాత్యహంకార సంస్ధ. దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ ఏజెంట్లను ఏర్పరుచుకుని అమెరికా అనుకూల-ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు…