అలో బి.బి.సి… నీ కిది తగునా?
సిరియా ‘కిరాయి తిరుగుబాటు’ కు సంబంధించి పశ్చిమ దేశాల కార్పొరేట్ వార్తా సంస్ధలు సిరియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి మరోసారి లోకానికి వెల్లడయింది. 2003 సంవత్సరంలో ఇరాక్ యుద్ధంలో తీసిన ఫోటోను ఆదివారం సిరియాలో జరిగిన హత్యాకాండగా చెప్పడానికి బి.బి.సి చేసిన ప్రయత్నం ‘ది టెలిగ్రాఫ్’ వెల్లడి చేసింది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల ఆయుధ, ఫైనాన్స్ సాయంతో, సౌదీ అరేబియా, ఖతార్ లాంటి మత ఛాందస ప్రభుత్వాల ప్రత్యక్ష మద్దతుతో సిరియా…
