ఫుకుషిమాలో రేడియేషన్ లీకేజి ఆగనే లేదు, ఇదుగో సాక్ష్యం

మార్చి 11, 2011 తేదీన సంభవించిన భారీ భూకంపం ఫలితంగా ఫుకుషిమా అణు కర్మాగారం తీవ్ర ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల వాతావరణంలోకి అణుధార్మికత పెద్ద ఎత్తున విడుదలయి అమెరికా, యూరప్ ల కు కూడా ప్రయాణించింది. ప్రమాదం జరిగాక నాలుగురోజుల్లోనే రేడియేషన్ విడుదలను అరికట్టామని టెప్కో కంపెనీ, జపాన్ ప్రభుత్వం చెప్పినా అది అబద్ధమేననీ చెబుతూ అనేకమంది జపనీయులు సాక్ష్యాలు ప్రచురించారు. డిసెంబర్ లో కోల్డ్ షట్ డౌన్ కూడా చేశామని…