కేంద్రానికి సుప్రీం కోర్టు ఝలక్, నల్లడబ్బు విచారణ పర్యవేక్షణకు ‘సిట్’ నియామకం
సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాలే విసిరింది. నల్ల డబ్బు వెలికి తీయడానికి కేంద్రం నియమించిన ‘హై లెవల్ కమిటీ’ (హెచ్.ఎల్.సి) పై పర్యవేక్షణకు “స్పెషల్ ఇన్‌వెష్టిగేషన్ టీం” (ఎస్.ఐ.టి – సిట్) ని ఏర్పాటు చేసింది. సుప్రీం నియమించిన సిట్ కు ఛైర్మన్‌గా రిటైరైన జస్టిస్ బి.పి.జీవన్ రెడ్డిని నియమించింది. డిప్యుటీ ఛైర్మన్ గా మరొక రిటైర్డ్ జస్టిస్ ఎం.బి.షా ను నియమించింది. ప్రభుత్వం నియమించిన హెచ్.ఎల్.సి ఇకనుండి సిట్ లో భాగంగా పనిచేస్తుంది.…