అతి చేస్తే ఫ్రెండ్‌షిప్ ఉండదు, జాగ్రత్త! అమెరికాకి పాక్ హెచ్చరిక
పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని అమెరికాని ఘాటుగా హెచ్చరించింది. పదే పదే పాకిస్ధాన్ పైన టెర్రరిస్టులతో సంబంధాలున్నాయనీ, పాకిస్ధాన్ ఇంటలిజెన్స్ సంస్ధ ఐ.ఎస్.ఐ ఇటీవల అమెరికా ఎంబసీపై దాడికి సాయం చేసిందనీ అమెరికా ఆరోపణలు చేస్తుండడంతో పాకిస్ధాన్ ప్రభుత్వం ఈ హెచ్చరిక చేసింది. టెర్రరిజంపై యుద్ధంలో పాకిస్ధాన్ డబుల్ గేమ్ ఆడుతోందని పదే పదే ఆరోపణలు చేసినట్లయితే ఒక మిత్రుడిని అమెరికా కోల్పోవలసి ఉంటుందనీ పాక్ విదేశాంగ మంత్రి హైనా హెచ్చరించింది. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలో…