10 జిల్లాల తెలంగాణకు కేబినెట్ నిర్ణయం

10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రాయల తెలంగాణ ఏర్పాటుపై సాగిన ఊహాగానాలకు దీనితో తెరపడింది. కావూరి సాంబశివరావు రాయల తెలంగాణ కోసం కేబినెట్ లో ప్రయత్నించినప్పటికి సాధ్యం కాలేదని వార్తా ఛానెళ్ల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్ 10 యేళ్లకు మించకుండా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధాని ఎక్కడో నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇది 45…

హైద్రాబాద్ రెవిన్యూ, పెట్టుబడులు, వాస్తవాలు

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. ‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై…