తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయాన్ని అడ్డుకోవడానికే రహస్య నోట్ -జస్టిస్ నరసింహారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకుండా అడ్డుకోవడానికే రహస్య నోట్ గా ప్రస్తావించిన 8 వ ఛాప్టర్ ను తమ నివేదికలో జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ పొందుపరిచిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. శ్రీ కృష్ణ కమిటీ తాను సమర్పించిన నివేదికలోని ఎనిమిదవ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ నరసింహా రెడ్డి బుధవారం తుది తీర్పును వెలువరించిన…