ఐ.ఎస్.ఐ అధికారులు, హేడ్లీ లపై ఛార్జి షీటు నమోదుకు ప్రభుత్వం అనుమతి
నవంబరు 26, 2008 తేదీనుండి మూడు రోజుల పాటు ముంబైలోని పలు ప్రదేశాల్లో టెర్రరిస్టులు దాడి చేసి పలువురిని చంపిన నేరానికి, ఇద్దరు ఐ.ఎస్.ఐ అధికారులు, హేడ్లీ, రాణాలపైన ఛార్జీ షీటు నమోదు చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్ధానీ అమెరికన్ టెర్రరిస్టు డేవిడ్ హేడ్లీ, పాకిస్ధానీ కెనడియన్ టెర్రరిస్టు తహవ్వూర్ రాణాలతో పాటు లష్కర్-ఎ-తొయిబా వ్యవస్ధాపకుడు హఫీజ్ సయీద్ లు ఇండియాలో టెర్రరిస్టు దాడులకు పధకం పన్నినందుకు ఛార్జి షీటు నమోదు చేయడానికి జాతీయ…