ఆఫ్ఘన్ లో మరో హెలికాప్టర్ కూల్చివేత, 14 మంది అమెరికా సైనికుల మరణం
ఆఫ్ఘన్ మిలిటెంట్లు మరొక అమెరికా హెలికాప్టర్ ని కూల్చివేసినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. తూర్పు ఆఫ్ఘన్ రాష్ట్రం ఘజని లోని అందర్ జిల్లాలో అమెరికా హెలికాప్టర్ ని కూల్చి వేసినట్లు తాలిబాన్ మిలిటెంట్లను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. హెలికాప్టర్ లో ఉన్న 14 మంది అమెరికా సైనికులు చనిపోయారని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ చెప్పాడు. హెలికాప్టర్ కూల్చివేతపై నాటో దళాల నుండి ఇంకా సమాచారం ఏదీ అందలేదని ప్రెస్ టి.వి తెలిపింది. 82 ఎం.ఎం…
