చైనా కంపెనీలతో దేశ భద్రతకి ప్రమాదం, అమెరికా కమిటీ హెచ్చరిక

చైనా టెలికమ్యూనికేషన్స్ కంపెనీలతో జాతీయ భద్రతకి ప్రమాదం కలగవచ్చని అమెరికా కమిటీ ఒకటి హెచ్చరించింది. ముఖ్యంగా ప్రఖ్యాత టెలీ కంపెనీలయిన హువి, జెడ్.టి.ఇ కంపెనీల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది. అమెరికా కంపెనీల స్వాధీనం, విలీనాల నుండి ఈ రెండు కంపెనీలను నిషేధించాలని సిఫారసు చేసింది. కాగా, తమ సిఫారసుకు కమిటీ చూపిన కారణం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. చైనా ప్రభుత్వంతోనూ, మిలటరీతోనూ తమకు సంబంధం లేదని రుజువు…