ఇరాన్ పై అమెరికా దాడికి ఒప్పుకోం -పాకిస్ధాన్
‘అణ్వాయుధాలు ఉన్నాయన్న’ పేరుతో ఇరాన్ పై అమెరికా మిలట్రీ దాడికి పూనుకుంటే తాము అంగీకరించేది లేదని పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి హీరా రబ్బానీ ఖర్ తేల్చి చెప్పింది. మరోక మిలట్రీ దాడికి ఈ ప్రాంతం భరించే స్ధితిలో లేదని ఆమె అభిప్రాయపడింది. అమెరికా ఎన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ ఇరాన్ తో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని కొనసాగిస్తామని కూడా ఖర్ తేల్చి చెప్పింది. “అవసరమైతే ఇరాన్ పైన బల ప్రయోగం చేయడానికైనా సిద్ధమేనంటూ ఒబామా చేసిన ప్రకటన …
