మానవత్వం లేని కాలేజీలు

ఢిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కొన్ని కాలేజీల తీరిది. అంగవైకల్యాన్ని జయించడానికి శ్రమిస్తున్న సాటి మనుషులకు తోడు నిలిచి భుజం తట్టడానికి బదులు యధాశక్తి అడ్డంకులు సృష్టిస్తున్న కాలేజీలు దేశ రాజధానిలోనే కొలువుదీరి ఉన్నాయి. తమ తరపున పరీక్ష రాయడానికి తోడు తెచ్చుకున్నవారిని నిర్దాక్షిణ్యంగా బైటికి తరిమికొట్టి, ఓ అంధ విద్యార్ధి పరీక్షలో తప్పడానికి సిద్ధపడిన కాలేజీ ఒకటైతే రైటర్ ని ఆలస్యంగా అందించడమే కాక కొశ్చేన్ పేపర్ కి పూర్తి సమాధానం ఇవ్వడానికి ఒక్క నిమిషం కూడా…