ఈశాన్య అమెరికాను వణికించిన బ్లిజ్జర్డ్ -ఫోటోలు
బ్లిజ్జర్డ్ అంటే హిమపాతం. మంచు తుఫానుతో పోలిస్తే తీవ్రత ఎక్కువ కలిగినది. రెండు లేదా మూడు అడుగుల ఎత్తున మంచు కురవడంతో పాటు గంటకు 35-50 మైళ్ళ వేగంతో సముద్రం మీది నుండి చలిగాలులు వీచడం బ్లిజ్జర్డ్ లక్షణం. అలాంటి తీవ్రమైన హిమపాతం జనవరి చివరి వారంలో అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను గజ గజ వణికించింది. హిమపాతానికి ముందు అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను ఈశాన్య అమెరికాను చుట్టుముడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.…