హిట్లర్ ఎలా చనిపోయాడు?
హిట్లర్ ఎలా చనిపోయాడన్న విషయంపై చాలా కాలం వరకు చర్చోపచర్చలు నడిచాయి. అసలు ఆయన అందరూ చెబుతున్నట్లు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అన్నది ఒక అనుమానం. ఆత్మహత్య చేసుకుంటే విషం మింగి చనిపోయాడా లేక తుపాకితో కాల్చుకుని చనిపోయాడా అన్నది మరో అనుమానం. బెర్లిన్ నగరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నది సోవియట్ సేనలే. హిట్లర్ సామ్రాజ్య పతనం గ్యారంటీ అని అర్ధం అయ్యాక పశ్చిమ రాజ్యాలు, సోవియట్ యూనియన్ మధ్య హిట్లర్ సామ్రాజ్యంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని…