ముస్లిం టెకీ హత్య: హిందూ రాష్ట్ర సేన ఘాతుకం

నరేంద్ర మోడి నేతృత్వం లోని హిందూ జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో సరిగ్గా వారం రోజులు పూర్తయింది. బి.జె.పి గానీ, మోడి గానీ అట్టహాసంగా ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలులోకి వచ్చేదీ వివరాలేవీ ఇంకా వెల్లడి కానేలేదు. కాంగ్రెస్/యు.పి.ఏ అమలు చేసిన నయా ఉదారవాద ఆర్ధిక విధానాలను మరింత దీక్షతో నిర్నిరోధంగా అమలు చేస్తారని స్వదేశీ, విదేశీ కంపెనీలు పెట్టుకున్న ఆశలను ప్రజలను మెప్పిస్తూ ఎలా నెరవేర్చవచ్చో తగిన ఐడియాలేవీ ఇంకా ప్రకటించబడనే లేదు.…