హవాయి లావా: అడవిని కాల్చీ, రోడ్లను మింగీ… -ఫోటోలు
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన హవాయి ద్వీపకల్పంలో కిలౌయీ అనే అగ్ని పర్వతం ఒకటుంది. అవడానికి పర్వతమే గానీ చూడడానికి పర్వతంలాగా కనిపించదు. భూ మట్టానికి పెద్దగా ఎత్తు లేకుండా మొత్తం లావాతోనే ఏర్పడి ఉండే ఇలాంటి అగ్ని పర్వతాలను షీల్డ్ వోల్కనో అంటారు. షీల్డ్ వోల్కనో బద్దలయినప్పుడు లావా అన్ని వైపులకీ ప్రవహిస్తుంది. తక్కువ చిక్కదనం (viscosity) కలిగి ఉండడం వలన ఈ లావా ప్రవాహ వేగం కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజుల తరబడి,…