అంతర్జాతీయ న్యాయస్ధానం నిర్ణయాన్ని తిరస్కరించిన లెబనాన్ హిజ్బొల్లా

లెబనాన్ మాజీ ప్రధాని రఫిక్ హరిరి హత్య కేసులో నలుగురు హిజ్బొల్లా నాయకులపై కోర్టు విచారణ జరగడానికి అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐ.సి.సి) ఆమోదించడాన్ని హిజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా తిరస్కరించాడు. రఫిక్ హరీరి 2005లో బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు. “గౌరవనీయులైన సోదరులను” ప్రపంచంలో ఏ శక్తీ అరెస్టు చేయలేదని నజ్రల్లా స్పష్టం చేశాడు. ఐ.సి.సి ట్రిబ్యునల్ విచారణకు నిర్ణయించిన నలుగురిని 30 రోజుల్లోగా అప్పగించాలని కోరింది. ఐక్యరాజ్య సమితి నియమించిన “లెబనాన్ కోసం ప్రత్యేక ట్రిబ్యునల్”…