ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ముగిసింది -పాలస్తీనా సంస్ధ హమాస్
పాలస్తీనా మిలిటెంట్ సంస్ధ “హమాస్,” శనివారం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాను అక్రమించిన ఇజ్రాయెల్ తో తనంత తానుగా ప్రకటించిన కాల్పుల విరమణ ముగిసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో మధ్య ప్రాచ్యం ప్రాంతంలో ఉద్రిక్తలు మరోమారు ఉచ్ఛ స్ధాయికి చేరనున్నాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, కారణం లేకుండా తమ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు చేస్తూ ప్రజలను చంపుతున్నందున తాము పాటిస్తున్న “కాల్పుల విరమణకు” ఇక అర్ధం లేదని హమాస్ సంస్ధ ప్రకటించింది. గత రెండు…