అమెరికా: సిక్కు డాక్టర్ పై దాడి
అమెరికాలో సిక్కు మతస్ధుల పట్ల అపోహలు కొనసాగుతున్నాయి. సిక్కుల తలపాగాను బిన్ లాడెన్ తలపాగాతో పోల్చుకుంటూ మొత్తం సిక్కులను టెర్రరిస్టులుగా భ్రమించే ధోరణి కొనసాగుతోంది. న్యూయార్క్ నగరంలో డాక్టర్ మరియు ప్రొఫెసర్ కూడా అయిన ఒక సిక్కు యువకుడిపై జరిగిన అమానుష దాడి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. అంతర్జాతీయ మరియు ప్రజా సంబంధాల విద్యా సంస్ధ (School of International and Public Affairs) లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రభుజోత్ సింగ్…
