‘హజ్’ సబ్సిడీ రద్దు చేసిన సుప్రీం కోర్టు
‘హజ్’ యాత్రకు వెళ్ళే ముస్లిం ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లించడాన్ని మంగళవారం సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మరో పదేళ్ళలో ‘హజ్’ సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలని తీర్పు నిచ్చింది. మతపరమైన యాత్రలకు సబ్సిడీలు ఇవ్వడం ‘చెడ్డ మతాచారం’ గా అభివర్ణించింది. యాత్రీకులకు తోడు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారిక డెలిగేషన్స్ పంపిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం ద్వారా ‘హజ్’ యాత్ర ను రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడింది. “ఈ విధానాన్ని అంతం చేయాలని…
